ఇశ్రాయేలు చరిత్ర
భూత, వర్తమాన, భవిషత్ కాలములలో
ఇశ్రాయేలు చరిత్ర
ప్రపంచములో గల అతి చిన్న దేశములలో ఒకటి- ఇశ్రాయేలు: అయిననూ ఇశ్రాయేలుకువలె మరే దేశముకు దేవుని దర్శనము మరియు న్యాయవిధులు లేవు. ఇశ్రాయేలును దేవుడు తన జనాంగముగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఈ చిన్న దేశము యొక్క ఉణికి, ప్రపంచములో ఇంతటి వివాదముకు కారణమెలా అయ్యింది? ఈ అంత్యదినములలో ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? భూమి మీద క్రీస్తు వెయ్యి సంవత్సరముల పాలన. నూతన ఆకాశము మరియు భూమిని గూర్చిన వివరాలేమిటి? పై ప్రశ్నలకు సమాధానములు ఈ గ్రంధములో పొందుపరచబడియున్నవి.
ఇశ్రాయేలు చరిత్ర చదువుట ద్వారా, ఆయన ప్రియ ప్రజల గమ్యము వైపుకి నడిపించుటకు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానియైన దేవుడు ప్రేమతో ఎలా వ్యవహరిస్తున్నాడో, వారి ద్వారా భూజనులకు ఆశీర్వదమును ఎలా రప్పిస్తున్నాడో చూడగలము.
ఇశ్రాయేలు దేశము యొక్క పూర్వపు వైభవము, ప్రస్తుత కష్టాలు మరియు వారి మెస్సయ్య, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందున్న మహిమోన్నతమైన నిరీక్షణ ఏమిటో, ప్రియచదువరులు గ్రహించుటకు ఈ గ్రంధము మీ ముందుంచబడుతుంది.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వ విద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. గత యాభై సంవత్సరములలో నూరు దేశములో పరిచర్య చేస్తూ దేవుని మార్గములలో నడుచుట, ఆధ్యాత్మిక సియోను పర్వతముకు చేర్చు పరిశుద్ధమైన మార్గములో నుండుట విశ్వాసులకు బోధిస్తున్నారు.
Only logged in customers who have purchased this product may leave a review.



Reviews
There are no reviews yet.